బిగ్ బాస్ లో తరుణ్.. అసలు విషయం ఇది..!

బిగ్ బాస్ సీజన్ 4 హంగామా త్వరలో మొదలవుతుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే ఈ సీజన్ లో 15 మంది కటెస్టంట్స్ ఉంటారని తెలుస్తుంది. ఈ సీజన్ లో కంటెస్టంట్ గా లవర్ బోయ్ తరుణ్ వస్తున్నాడని కొన్నళ్లుగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా బిగ్ బాస్ 4లో తరుణ్ ను కన్ఫర్మ్ చేస్తూ కంటెస్టంట్స్ లిస్ట్ ఒకటి చెక్కర్లు కొడుతుంది. ఈ వార్తలన్నిటిని సమాధానం చెబుతూ తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 4లో తాను కంటెస్టంట్ గా రావట్లేదని అన్నారు.  

ఆ షో మీద తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని. ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో కూడా బిగ్ బాస్ షోలో కంటెస్టంట్ గా వచ్చే ఛాన్స్ లేదని చెప్పాడు. 3 సక్సెస్ ఫుల్ సీజన్ లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ మరింత జోష్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. 15 మంది కంటెస్టంట్స్ లో యువ నటీనటులు, బుల్లితెర యాక్టర్స్ కూడా సర్ ప్రైస్ చేస్తారని తెలుస్తుంది.