'పవర్ స్టార్' ట్రైలర్ రిలీజ్..!

సంచలనం ఇంటి పేరుగా మార్చుకున్నా డైరక్టర్ ఆర్జీవి తను తీసే సినిమాల కన్నా ఎంచుకునే కాన్సెప్టులు, ట్రైలర్ లతో సంచలనం సృష్టిస్తాడు. ఒకప్పుడు ఫోకస్డ్ గా సినిమాలు తీసే వర్మ ఇప్పుడు పూర్తిగా ట్రాక్ తప్పి పిచ్చి పిచ్చి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఏటిటి ఫ్లాట్ ఫాంలో తన పైత్యాన్ని చూపిస్తున్న వర్మ ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేయగా మూడవ సినిమాను కూడా వదులుతున్నాడు.

పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వర్మ చేస్తున్న సినిమా పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ ను ప్రవన్ కళ్యాణ్ గా సినిమాలో సంభోదించాడు.. ఎలక్షన్స్ తర్వాత పవన్ అదేనండి ప్రవన్ ఎలా ఫీల్ అయ్యాడో అన్న కథతో పవర్ స్టార్ సినిమా తీశాడు. ఈ సినిమా ట్రైలర్ కొద్దిగంటల క్రితం రిలీజైంది. తను రిలీజ్ చేయడానికి ముందే పవర్ స్టార్ ట్రైలర్ రిలీజ్ అవడం విశేషం.    

అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ సినిమా చేసిన ఆర్జీవి ట్రైలర్ తో హంగామా చేస్తున్నాడు. చివర్లో గ్లాస్ పగలగొట్టి.. జై పవర్ స్టార్ అని ట్యాగ్ వేయడం చూస్తుంటే ఆర్జీవి ఈ సినిమాతో ఏం చెప్పదలచుకున్నాడో అన్న ఆస్క్తి పెరిగింది. సినిమాన్ ఆర్జివి వరల్డ్ థియేటర్ లో ఈ నెల 25న రిలీజ్ అవుతుంది.