వెబ్ సీరీస్ తీస్తున్న సందీప్ వంగ..!

అర్జున్ రెడ్డి సినిమాతో డైరక్టర్ గా తన మొదటి సినిమాతోనే ఓ బ్రాండ్ వేసుకున్న సందీప్ వంగ అదే సినిమాను బాలీవుడ్ లో తీసి సెన్సేషనల్ హిట్ కొట్టాడు. తన నెక్స్ట్ సినిమా రణ్ బీర్ తో ప్లాన్ చేస్తున్న సందీప్ వంగ తెలుగులో విజయ్ దేవరకొండతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాల కన్నా ముందు అర్జున్ రెడ్డి డైరక్టర్ వెబ్ సీరీస్ చేయాలని డిసైడ్ అయ్యాడట.

సెన్సార్ ఉన్నా సరే అర్జున్ రెడ్డితో హంగామా చేసిన సందీప్ వంగ ఇక అలాంటివేమి లేకుండా చేసే వెబ్ సీరీస్ ఏం చేస్తాడో.. ఏం తీస్తాడో అని ఆడియెన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు. కంటెంట్ ఉన్న వెబ్ సీరీస్ లు మాత్రమే కాదు బూతు కంటెంట్ తో వచ్చే వెబ్ సీరీస్ లు కూడా ఓటిటిలో ఎక్కువయ్యాయి. మరి సందీప్ వంగ వెబ్ సీరీస్ అనగానే అందరిలో ఆసక్తి ఏర్పడింది. మరి సినిమాలో లానే రొమాంటిక్ ఎంటర్టైనర్ తీస్తాడా లేక విషయం ఉన్న కథను వెబ్ సీరీస్ గా ఎంచుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది.