
సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే. ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ మీద కనిపిస్తేనే ఆ హంగామా వేరేలా ఉంటుంది. అలాంటిది ఇద్దరు స్టార్స్ కలిసి సినిమా చేస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకుంటేనే సూపర్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కాంబో సినిమా కోసం డిస్కషన్స్ నడుస్తున్నాయని తెలుస్తుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాణలో మహేష్ సినిమా గురించి కొన్నాళ్లుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ ప్రజెక్ట్ లో తారక్ ను కూడా చేర్చారు.
అల్లు అరవింద్ మహేష్, ఎన్.టి.ఆర్ లతో భారీ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమాకు దర్శకుడు ఎవరన్నది నిర్ణయించలేదు కాని ఈ ఇద్దరు ఓకే అంటే మాత్రం భారీ మూవీ చేసే ఆలోచనలో ఉన్నాడట అల్లు అరవింద్. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ కోసం తారక్, రాం చరణ్ కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు మహేష్, ఎన్.టి.ఆర్ సినిమా వార్తల్లో నిలుస్తుంది. మరి ఈ కాంబో సినిమా కేవలం రూమర్ గా నిలిచిపోతుందా.. లేక నిజంగా సినిమాగా వస్తుందా అన్నది చూడాలి.