
ఎప్పుడెప్పుడా అని ఆడియెన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. లేటెస్ట్ గా ఓ ప్రోమోతో త్వరలో బిగ్ బాస్ 4 షురూ అవుతుందని చెప్పారు. బిగ్ బాస్ అభిమానులకు ఈ ఎనౌన్స్ మెంట్ ఆనందాన్ని ఇచ్చింది. సీజన్ 3 హోస్ట్ గా చేసిన కింగ్ నాగార్జుననే ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తారని తెలుస్తుంది. ఇక ఈ సీజన్ లో 15 మంది కంటెస్టంట్స్ ఉంటారని సమాచారం.
బిగ్ బాస్ సీజన్ 4 సరికొత్త టాస్క్ లతో కొత్తగా ఉండబోతుందట. ఇక ఈ సీజన్ లో కంటెస్టంట్స్ గా శ్రద్ధా దాస్, యామిని భాస్కర్, తరుణ్, హం సా నందిని, మంగ్లీ, బిత్తిరి సత్తి వస్తున్నారని తెలుస్తుంది. స్టార్ సెలబ్రిటీస్ తో ఈ సీజన్ అదరగొట్టేయడం ఖాయమని అంటున్నారు. నాగర్జున హోస్ట్ గా చేసిన సీజన్ 3 సూపర్ హిట్ కాగా ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి.