రాజమౌళికి సలహా ఇస్తున్న ఆర్జీవి..!

తను తీసే సినిమాలు ఎలా ఉన్నా ప్రమోషన్స్, కామెంట్స్ తో హాట్ న్యూస్ గా నిలుస్తాడు రాం గోపాల్ వర్మ. కరోనా టైంలో అందరు ఇల్లలోనే ఉంటే ఆయన మాత్రం వరుస సినిమాలు రిలెజ్ చేస్తున్నారు. క్లైమాక్స్, నగ్నం సినిమాలు ఇప్పటికే ఆర్జివి వరల్డ్, శ్రేయాస్ ఈటి ఏటిటి ద్వారా రిలీజ్ కాగా అవి చూసేందుకు 100, 200 రూపాయల టికెట్ కూడా పెట్టాడు ఆర్జివి. ఇక లేటెస్ట్ గా పవర్ స్టార్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు ఆర్జీవి. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వర్మ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ 22న ఉదయం 11 గంటలకు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ కు టికెట్ ఫిక్స్ చేశాడు ఆర్జీవి.

ట్రైలర్ చూడాలంటే పాతిక రూపాయలు పెట్టాల్సిందే. ఇక తను ఫాలో అయ్యే ఈ పద్ధతిని రాజమౌళి కూడా ఫాలో అవ్వాలని సూచిస్తున్నాడు. RRR సినిమా ట్రైలర్ చూడాలంటే కూడా థియేటర్ లో టికెట్ పెట్టాలని.. ఆ సినిమా ట్రైలర్ కు 200 రూపాయలు పెట్టినా చూస్తారని. అప్పుడు నిర్మాత లాభాలు పొందవచ్చని అంటున్నాడు వర్మ. మరి ఆర్జీవి ఇచ్చిన సలహాని రాజమౌళి పాటిస్తాడా లేదా అన్నది చూడాలి.