భీష్మ డైరక్టర్ తో రాం చరణ్..!

ఒక్క సినిమాతో హిట్టు కొట్టి ఆ వెంటనే స్టార్ హీరో ఛాన్సులు పట్టేస్తున్నారు యువ దర్శకులు. వారిలో టాలెంట్ ఎంత ఉంది అన్నది వారు తీసే మొదటి సినిమాతోనే తెలుస్తుంది. ఛలో సినిమాతో డైరక్టర్ గా తనని తాను ప్రూవ్ చేసుకుని.. ఈ ఇయర్ భీష్మతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న డైరక్టర్ వెంకీ కుడుముల. తను తీసే సినిమాల్లో కథ అంత గొప్పగా లేకపోయినా ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో మాత్రం త్రివిక్రం శిష్యుడు అనిపించుకున్నాడు. ఛలో, భీష్మతో రెండు హిట్లు కొట్టిన ఈ డైరక్టర్ తన నెక్స్ట్ సినిమా మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్.

ప్రస్తుతం రాం చరణ్ RRR సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా కొరటాల శివ, చిరంజీవి కాంబోలో వస్తున్న ఆచార్యలో కూడా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత భీష్మ డైరక్టర్ తో చరణ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈమధ్యనే చరణ్ కు ఓ లైన్ చెప్పాడట. లైన్ నచ్చడంతో చరణ్ వెంకీ కుడుముల డైరక్షన్ లో సినిమాకు ఓకే చెప్పాడని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.