
ప్రభాస్ 21వ సినిమా బిగ్ ఎనౌన్స్ మెంట్ తో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నారు. బహుబలితో నేషనల్ స్టార్ అయిన ప్రభాస్.. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా అవతరిస్తాడని అంటున్నారు. అశ్వనిదత్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనేని సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. కింగ్ కు సరిపోయే క్వీన్ కావాలంటూ డైరక్టర్ నాగ్ అశ్విన్ సినిమాలో దీపికా హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించారు.
ఈ ప్రెస్టిజియస్ మూవీలో దీపికాని తీసుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఈ మూవీలో నటించేందుకు గాను దీపికా భారీగా డిమాండ్ చేసిందట. ప్రభాస్ 21లో దీపికా రెమ్యునరేషన్ 30 కోట్లని తెలుస్తుంది. అమ్మడు ఎంత అడిగిందో కాని ఫైనల్ గా 30 కోట్లకు ఫిక్స్ చేశారు. దీపికా గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ మూవీలో ఆమెను సెలెక్ట్ చేశారు. మొదటిసారి తెలుగు సినిమా చేస్తున్న దీపికా పదుకొనెకి ఇక్కడ ఆడియెన్స్ ఫిదా అవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.