మహేష్ మెచ్చిన తమిళ సినిమా..!

రెగ్యులర్ గా షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉండే సినీ స్టార్స్ ఇప్పుడు ఇంటికే పరిమితమవుతున్నారు. కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న కారణంగా వ్యాక్సిన్ వచ్చి సక్సెస్ అయితే తప్ప ఇప్పుడప్పుడే సినిమా షూటింగ్స్ ఉండే ఛాన్స్ లేదని తెలుస్తుంది. ఈ టైంలో అందరు స్టార్స్ తమ పర్సనల్ ఇంట్రెస్ట్ ల మీద దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఎప్పుడూ బిజీగా ఉండే సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం బుక్స్ చదువుతూ.. సినిమాలు చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. 

రీసెంట్ గా డార్క్ అనే జర్మన్ వెబ్ సీరీస్ ను చూసి సూపర్ అనేసిన మహేష్ లేటెస్ట్ గా తమిళ సినిమా ఓ మై కడవులే సినిమాపై పొగడ్తల వర్షం కురిపించాడు. సినిమా చూసిన మహేష్ సినిమాలో ప్రతి సన్నివేశం ఎంజాయ్ చేశానని.. సూపర్ పర్ఫార్మెన్స్, డైరక్టర్ అశ్వథ్ రైటింగ్, డైరక్టింగ్ చాలా బాగుందని ట్వీట్ చేశారు మహేష్. మహేష్ చేసిన ట్వీట్ ఈ చిత్రయూనిట్ కు ఫుల్ జోష్ ఇచ్చింది.