
సుకుమార్, అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమాకంటే ముందు మహి వి రాఘవ డైరక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. కళాశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలతో తన టాలెంట్ చూపించిన డైరక్టర్ మహి వి రాఘవ తన నెక్స్ట్ సినిమా బన్నీతో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సిఎంగా కనిపిస్తాడని తెలుస్తుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న బన్నీ ఆ సినిమా తర్వాత మహి వి రాఘవ డైరక్షన్ లో సినిమ్మాను కూడా ఆ రేంజ్ లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. బన్నీ, మహి కాంబో ఊహించుకుంటేనే అదిరిపోతుంది. మరి ఈ కలయికతో వచ్చే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.