
సౌత్ స్టార్ డైరక్టర్ మణిరత్నం నిర్మాతగా చేస్తున్న వెబ్ సీరీస్ నవరస. 9 కథలతో 9 మంది దర్శకులు కలిసి చేస్తున్న ఈ వెబ్ సీరీస్ లో సూర్య విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ లో నటించాలని తెలుగు హీరోలు నాని, నాగ చైతన్యలను అడిగారట. వాళ్లు మాత్రం ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారని తెలుస్తుంది. అయితే సూర్య మాత్రం వెబ్ సీరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
వెబ్ సీరీస్ లో ఒక స్టోరీని జయేంద్ర డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. సూర్య నటించే ఈ వెబ్ సీరీస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేశారట. సూర్య మాత్రమే కాదు సిద్ధార్థ్, అరవింద స్వామి ఇంకా చాలామంది స్టార్స్ ఈ వెబ్ సీరీస్ లో నటిస్తున్నారని తెలుస్తుంది. మరి వెబ్ సీరీస్ కు సంబందించిన పూర్తి డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.