సమంత ప్లేస్ లో దివ్యాన్ష కౌషిక్

RX 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమా కథ పట్టుకుని చాలామంది హీరోల దగ్గరకు వెళ్లాడు. రామ్, నితిన్, రవితేజ, ఫైనల్ గా నాగ చైతన్య ఇలా అందరు హీరోలు సినిమా కథ నచ్చిందని చెప్పినా సరే ఎందుకో ఫైనల్ గా ఓకే చెప్పలేదు.  చివరగా శర్వానంద్ హీరోగా ఆ సినిమా ఓకే చేసుకున్నాడు. ఈ సినిమాలో కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా సమంతని అడిగితే ఆమె చేయనని చెప్పిందట. నాగ చైతన్య హీరోగా చేస్తే తాను హీరోయిన్ గా నటించడానికి ఓకే చెప్పగా ఇప్పుడు చైతు ఆ సినిమా చేయట్లేదని తెలిసి ఆమె కూడా కాదనేసింది. 

శర్వానంద్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా దివ్యాన్ష కౌశిక్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. శివ నిర్వాణ డైరక్షన్ లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన మజిలీ సినిమాలో ఆమె నటించింది. ఆ సినిమాలో తన నటనతో మెప్పించిన ఈ అమ్మడు ఆ తర్వాత పెద్దగా ఛాన్సులు అందుకోలేదు. లేటెస్ట్ గా మహా సముద్రంలో అమ్మడిని ఓకే చేసినట్టు తెలుస్తుంది. శర్వానంద్ తో సమంత ఆల్రెడీ జాను సినిమాలో నటించగా మహా సముద్రం సినిమాలో సమంత ప్లేస్ లో దివ్యాన్ష కౌశిక్ నటిస్తుంది.