పుష్పలో అనన్యా పాండే స్పెషల్ సాంగ్..!

అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఎర్రచందనం నేపథ్యంతో తెరకెక్కే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సుకుమార్ సినిమాలో స్పెషల్ సాంగ్ కంపల్సరీ ఉంటుంద్. ఆర్య సినిమాలో అ అంటే అమలాపురం దగ్గర నుండి రంగస్థలంలో జిగేల్ రాణి వరకు ప్రతి సినిమాలో అలాంటి ఓ సాంగ్ పెడతాడు.

ఇక పుష్ప సినిమాలో కూడా అలాంటి ఓ స్పెషల్ నంబర్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సాంగ్ లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతులా నర్తిస్తుందని అన్నారు. కాని లేటెస్ట్ గా అనన్యా పాండేని ఓకే చేసినట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, పూరి కాంబినేషన్ లో వస్తున్న ఫైటర్ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అవకముందే అమ్మడికి లక్కీ ఛాన్సులు వస్తున్నాయి. పుష్పలో అనన్యా పాండే సాంగ్ కన్ ఫర్మ్ అయితే మాత్రం అమ్మడు టాలీవుడ్ లో దుమ్ముదులిపేయడం ఖాయమని చెప్పొచ్చు.