
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో తెరకెక్కే సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ ఓ అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనేని ఫైనల్ చేశారు. కింగ్ కు సరిపడే క్వీన్ కావాలి కదా చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం.. పిచ్చెక్కించేద్దాం అని నాగ్ అశ్విన్ ప్రభాస్ 21 సినిమాలో హీరోయిన్ గా దీపికాని కన్ ఫర్మ్ చేస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు.
మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంతో మెప్పించిన డైరక్టర్ నాగ్ అశ్విన్ తన సెకండ్ సినిమా మహానటితో సెన్సేషనల్ హిట్ అందించాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో భారీ సినిమా ప్లాన్ చేశాడు నాగ్ అశ్విన్. సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కే ఈ సినిమా హాలీవుడ్ సినిమా రెంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. రాజుకి తగ్గ రాణిని ఫిక్స్ చేసిన నాగ్ అశ్విన్ ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు రాధేయ్ శ్యామ్ టైటిల్ ఫిక్స్ చేశారు. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2021 సమ్మర్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.