మెహెర్ రమేష్ కు మెగా ఛాన్స్..!

తను తీసిన నాలుగు సినిమాలతోనే డైరక్టర్ గా తన మీద ఫ్లాప్ ముద్ర వేసుకున్న దర్శకుడు మెహెర్ రమేష్. అంతకుముందు స్టార్ డైరక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా వర్క్ చేసిన మెహెర్ రమేష్ మొదటి సినిమా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా కంత్రి సినిమాను డైరెక్ట్ చేశాడు. కంత్రి పర్వాలేదు అనిపించుకోగా ఆ వెంటనే  తమిళ సూపర్ హిట్ సినిమా బిల్లా తెలుగు రీమేక్ ను డైరెక్ట్ చేశాడు మెహెర్ రమేష్. తెలుగు బిల్లా కూడా హిట్ అనిపించుకుంది.         

ఆ తర్వాత ఎన్.టి.ఆర్ తో చేసిన శక్తి సినిమా డిజాస్టర్ కాగా విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన షాడో సినిమా వెంకీ కెరియర్ లో నంబర్ 1 డిజాస్టర్ గా నిలిచింది. 2013లో షాడో రాగా 7 ఏళ్ళుగా అతన్ని నమ్మి ఎవరు డైరక్షన్ ఛాన్స్ ఇవ్వట్లేదు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి మెహెర్ రమేష్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుండగా.. మెగా డాటర్ సుస్మిత ప్రొడక్షన్ లో మెహెర రమేష్ ఓ వెబ్ సీరీస్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి మెహెర్ రమేష్ ఈసారైనా సరే హిట్లు కొడతాడా లేక మళ్లీ తన పాత పంథానే కొనసాగిస్తాడా అన్నది చూడాలి.