హీరోతో పెళ్లికి సిద్ధమైన త్రిష..?

సౌత్ క్రేజీ హీరోయిన్ త్రిష తెలుగు, తమిళ భాషల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. 15 ఏళ్ల సక్సెస్ ఫుల్ కెరియర్ లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా అమ్మడు అవకాశాలను అందుకుంటుంది. మధ్యలో బిజినెస్ మెన్ వరుణ్ తో పెళ్లికి సిద్ధమై ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది అమ్మడు. రెండేళ్ల క్రితం వచ్చిన 96 సినిమా సూపర్ హిట్ అవడంతో అమ్మడు మళ్ళీ కెరియర్ లో బిజీగా మారింది.

ఇక లేటెస్ట్ గా త్రిష పెళ్లిపై ఓ న్యూస్ కోలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. తమిళ హీరో శింబుతో త్రిష పెళ్లికి రెడీ అయ్యిందని త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. శింబు, త్రిష కలిసి రెండు సినిమాల్లో నటించారు. ఇద్దరు రీసెంట్ గా లాక్ డౌన్ టైం లో గౌతం మీనన్ డైరక్షన్ లో ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు. తమిళ ఏమాయ చేసావే సినిమాతో ఈ జోడీకి సూపర్ క్రేజ్ ఏర్పడింది.     

తమిళంలో వివాదాల హీరోగా శింబు కెరియర్ కూడా నాశనం చేసుకున్నాడు. ఆల్రెడీ నయనతర, హాన్సికలతో లవ్ స్టోరీ నడిపించిన శింబు త్రిషని పెళ్లాడటం ఏంటని ఆడియెన్స్ షాక్ అవుతున్నారు. మరి ఈ పెళ్లి వార్తలపై ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాలని కోరుతున్నారు ప్రేక్షకులు.