నిజమైన 'శ్రీమంతుడు' మహేష్

సూపర్ స్టార్ మహేష్ మరోసారి తన మంచి మనసుని చాటుకున్నాడు. రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అనిపించుకున్నాడు. ఊరు మనకు ఎంతో ఇచ్చింది.. దానికి ఎంతోకొంత తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం అనే శ్రీమంతుడు సినిమా డైలాగ్ లానే.. ప్రేక్షకులు తన సినిమాలు చూడబట్టే తానీ స్థానంలో ఉన్నానని గుర్తు చేసుకునే మహేష్ వారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. 

ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి మహేష్ చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ చేయిస్తున్నారు. పేద కుటుంబాలకు చెంది.. గుండెకు సంబందించిన వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సర్జరీకి అవసరమైన సాయాన్ని అందిస్తున్నారు మహేష్. ఇప్పటివరకు 1010 చిన్నారులకు ఎంతో క్లిష్టమైన గుండె ఆపరేషన్ కు సయాం చేశారు. రీసెంట్ గా భవ్యశ్రీ అనే చిన్నారి హార్ట్ సర్జరీకి మహేష్ సాయం అందించారు. జూలై 17న ఆంధ్రా హాస్పిటల్ లో ఆ చిన్నారికి సర్జరీ చేశారు. చిన్నారులకు ప్రాణదానం చేసి మహేష్ నిజమైన శ్రీమంతుడు అనిపించుకుంటున్నాడు.