ప్రభాస్ సినిమాలో కియరా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఈమధ్యనే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా కాదు ఇంటర్నేషన రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది.   

సైన్స్ ఫిక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు క్రేజీ భామ దీపికా పదుకునే ఛాన్స్ అందుకుందని వార్తలు రాగా ఇప్పుడు ఆమె ప్లేస్ లో కియరా అద్వానిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న కియరా అద్వాని తెలుగులో సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది. ఇప్పటికి తెలుగులో ఛాన్సులు వస్తున్నా బాలీవుడ్ సినిమాలతో డేట్స్ ఖాళీ లేవని చెబుతుందట. వచ్చే ఏడాది మొదలయ్యే ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాకు మాత్రం ఆమె ఓకే చెప్పినట్టు టాక్.