ఆచార్యకు కాజల్ డిమాండ్ ఎంతంటే..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. ఈ సినిమాలో నటించేందుకు కాజల్ భారీ రెమ్యునరేషన్ అదుకుంటుందని తెలుస్తుంది. మాములుగా సినిమాకు కోటిన్నర రెండు కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకునే కాజల్ ఆచార్య సినిమాకు కూడా కోటిన్నర దాకా డిమాండ్ చేసిందట.  

సీనియర్ స్టార్ హీరోలకు ఫస్ట్ ఆప్షన్ గా మారిన కాజల్ అగర్వాల్ ఖైది నంబర్ 150 తర్వాత మరోసారి చిరు సరసన నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా కాజల్ ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తుంది. పాతికేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇండియన్ సినిమాకు సీక్వల్ గా ఇండియన్ 2 తెరకెక్కుతుంది. శంకర్, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న ఈ క్రేజీ సినిమాలో కాజల్ అదరగొడుతుందని తెలుస్తుంది.