మదర్ రోల్ లో అనసూయ..?

స్మాల్ స్క్రీన్ హాట్ యాంకర్ అనసూయ తన అందచందాలతో ఆడియెన్స్ ను మెప్పిస్తుంది. రియాలిటీ షోలతోనే కాదు సినిమాలతో కూడా అమ్మడు తన ఫాం కొనసాగిస్తుంది. ప్రస్తుతం నితిన్ అందాదున్ రీమేక్ తో పాటుగా కృష్ణవంశీ రంగమార్తాండాలో కూడా అమ్మడు ఛాన్స్ దక్కించుకుంది. ఇక లేటెస్ట్ గా అనసూయ ఓ యువ హీరో సినిమాలో మదర్ రోల్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. సుమంత్ అశ్విన్ హీరోగా వస్తున్న సినిమాలో మదర్ రోల్ కు ఇంపార్టెంట్ ఉందట. ఆ పాత్ర కోసం అనసూయని అడిగినట్టు తెలుస్తుంది.   

బుల్లితెర మీద గ్లామర్ షో చేస్తున్న సిల్వర్ స్క్రీన్ పై మాత్రం ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్న అమ్మడు మదర్ రోల్ లో అనగానే ఆడియెన్స్ షాక్ అయ్యారు. కాని తనని అలా చూడడానికి ఫ్యాన్స్ ఒప్పుకోరని ఆ సినిమా ఆఫర్ ను కాదని చెప్పిందట. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో మెప్పించిన అనసూయ రానున్న సినిమాల్లో మరింత క్రేజ్ సంపాదిస్తుందని తెలుస్తుంది.