అంచనాలకు మించి 'RRR'

ఒక్క స్టార్ తోనే రికార్డులు సృష్టించే సినిమాలు చేసే రాజమౌళికి ఇద్దరు సూపర్ స్టార్స్ ను ఇస్తే.. బాహుబలి తర్వాత అంతకుమించిన భారీ సినిమాకు ప్లాన్ చేశాడు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న భారీ సినిమా ట్రిపుల్ ఆర్. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా గురించి సినిమా రైటర్ సాయి మాధవ్ బుర్ర చెబుతూ.. ఆడియెన్స్ సినిమా మీద ఎలాంటి అంచనాలతో వస్తారో ఆ అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

రాజమౌళి మరో అద్భుత సృష్టి ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాతో మరోసారి ఆయన అద్భుతాలు చేస్తాడని అంటున్నాడు సాయి మాధవ్ బుర్ర. అలూరి టీజర్ తోనే అదరహో అనిపించిన రాజముళి తప్పకుండా ఈ సినిమాను ఆశించిన స్థాయిలో తీస్తాడని అంటున్నారు. 2021 జనవర్ 8న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అని చెప్పినా సినిమా మరోసారి వాయిదా పడక తప్పదని తెలుస్తుంది.