బుల్లితెర మీద కె.జి.ఎఫ్ రికార్డ్

కన్నడ మూవీ కె.జి.ఎఫ్ తెలుగులో ఇప్పటికి రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. 2018లో రిలీజైన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ తెలుగుతో పాటుగా తమిళ, హింది భాషల్లో కూడా ఘన విజయాన్ని అందుకుంది. ఒక్క సినిమాతో యశ్ సౌత్ స్టార్ గా మారిపోయాడు. ఇక ప్రశాంత్ నీల్ ప్రతిభ టాలెంట్ రేంజ్ ఏంటో తెలిసింది.

ప్రస్తుతం కె.జి.ఎఫ్ పార్ట్ 2 షూటింగ్ జరుగుతుంది. సినిమా వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికి కె.జి.ఎఫ్ రికార్డులు కొడుతూనే ఉంది. తెలుగు బుల్లితెర మీద కె.జి.ఎఫ్ రికార్డ్ టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది. డబ్బింగ్ సినిమాల టి.ఆర్.పి రేటింగ్స్ లో టాప్ 5వ పొజిషన్ లో నిలిచింది కె.జి.ఎఫ్. రోబో 19.8, బిచ్చగాడు 18.7, కాంచన 14.52, కబాలి 13.1 టి.ఆర్.పి రేటింగ్స్ తెచ్చుకోగా కె.జి.ఎఫ్ కూడా 11.9 టి.ఆర్.పి రేటింగ్ తో అదరగొట్టింది. జూలై 5న వరల్డ్ ప్రీమియర్ గా స్మాల్ స్క్రీన్ లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ సినిమాల్లో టాప్ 5 స్థానంలో నిలిచింది.