
తేజ డైరక్షన్ లో గోపిచంద్ హీరోగా వస్తున్న సినిమా అలివేలుమంగ వెంకటరమణ. ఒకప్పుడు గోపిచంద్ ను విలన్ గా చూపించిన తేజా అతను హీరోగా మారాక సినిమా చేయలేదు. లేటెస్ట్ గా ఈ క్రేజీ కాంబో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన తేజా ఆ తర్వాత సీత సినిమాతో నిరాశపరచినా సరే రానాతో సినిమా గోపిచంద్ తో అలివేలు వెంటకరమణ సినిమాలు ఎనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశాడు.
రానా సినిమాకనా ముందే గోపిచంద్ సినిమా మొదలవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుందని వార్తలు రాగా ఇప్పుడు ఆమె ప్లేస్ లో మహానటి కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మహానటి సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో వరుస క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియా, గుడ్ లైఫ్ సఖి సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నట్టు టాక్. మొత్తానికి తెలుగులో కీర్తి సురేష్ ఓ రేంజ్ ఫాం కొనసాగించేలా ఉంది.