మెగాస్టార్ మాస్క్ కాంపెయిన్..!

ఎక్కడో ఊహాన్ సిటీలో మొదలైన కరోనా విధ్వంసం మన ఊరికి వచ్చేసింది. దేశంలో రోజు రోజుకి కరోనా కేసుల వివరాలు షాక్ ఇస్తున్నాయి. కరోనా తీవ్రత చూస్తుంటే వ్యాక్సిన్ ఏదైనా వస్తేనే కాని దీన్ని కంట్రోల్ చేయడం కష్టమని తెలుస్తుంది. ఇక ఈ టైంలో ఎవరికి వారు జాగ్రత్త పడటం తప్ప చేసేది ఏమి లేదు. కరోనా క్రైసిస్ టైంలో సిని పరిశ్రమ తరపున మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సిసిసి ని ఏర్పరచి సిని కార్మికులకు కావాల్సిన్ నిత్యావసరాలను అందిస్తున్నారు.

ఇక కరోనా గురించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ఎప్పటికప్పుడు వీడియో మెసేజ్ ఇస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా మాస్క్ కాంపెయిన్ కూడా మొదలుపెట్టారు చిరంజీవి. యువ హీరో కార్తికేయ, హీరోయిన్ ఈషా రెబ్బాలకు మాస్క్ అందించి మస్క్ ధరించి మిమంలని మీరు కాపాడుకోండి.. మీ కుటుంబాన్ని.. దేశాన్ని కాపాడండి అంటూ ఓ వీడియో సోషల్ మెఏడియాలో రిలీజ్ చేశారు. చిరు వీడియోకి మంచి స్పందన వస్తుంది.