మెగా మేనల్లుడు దూకుడు మీద ఉన్నాడు

 మెగా మేనల్లుడు సాయి తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. సుబ్బు డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాను బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయి తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ తర్వాత ప్రస్థాన ఫేమ్ దేవా కట్టా డైరక్షన్ లో సాయి తేజ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీ తర్వాత చిరు రిఫరెన్స్ తో గోపాల్ అనే నూతన దర్శకుడికి సాయి తేజ్ ఓకే చెప్పాడట.

ఇక ఈ సినిమాతో పాటుగా ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ డైరక్షన్ లో కూడా సాయి తేజ్ సినిమా ఒకటి ఉంటుందని తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారట. బివిఎస్ రవి కథ అందించగా విరిచి వర్మ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైరక్షన్ చేయనున్నాడని తెలుస్తుంది. చిత్రలహరి సినిమాతో హిట్ కొట్టిన సాయి తేజ్ ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. కథల విషయంలో జాగ్రత్తలు పడుతున్న సాయి తేజ్ రాబోయే సినిమాలతో సత్తా చాటుతాడని తెలుస్తుంది.