హీరోయిన్ ప్రేమలో పడ్డ యువ హీరో

సౌత్ స్టార్ డైరక్టర్ రవిరాజా పినిశెట్టి తనయుడు అది పినిశెట్టి తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. కేవలం హీరోగానే కాదు విలన్, సపోర్టింగ్ రోల్స్ ఇలా ఏ పాత్ర అయినా తనకు ఓకే అని చెబుతున్న ఆది హీరోయిన్ ప్రేమలో పడ్డాడని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఆది పినిశెట్టి తండ్రి రవిరాజా పినిశెట్టి బర్త్ డే పార్టీలో పినిశెట్టి ఫ్యామిలీతో పాటుగా నిక్కి గర్లాని కూడా పార్టీలో జాయిన్ అయ్యింది. కేవలం ఫ్యామిలీ పార్టీగా జరిగిన ఈ ఈవెంట్ లో నిక్కిని చూసి ఆది, నిక్కిల మధ్య రిలేషన్ చాలా దూరం వెళ్లిందని అంటున్న్నారు.

ఆది, నిక్కి గర్లాని కలిసి మరకతమణి సినిమాలో నటించారు. అప్పటినుండి ఇద్దరి మధ్య రిలేషన్ ఉందట. అప్పుడప్పుడు జంటగా కనిపిస్తున్న వీరి గురించి వార్తల్లో వస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ ప్రైవేట్ పార్టీకి కూడా హీరోయిన్ ప్రత్యక్షమైంది అంటే ఆది, నిక్కి త్వరలోనే ఒకటి కాబోతున్నారని అంటున్నారు. ఆది, నిక్కి నిజంగానే ప్రేమలో ఉన్నారా.. వారిపై వస్తున్న ఈ వార్తలపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.