చిరుతో స్టెప్పులేస్తున్న మిల్కీ బ్యూటీ..!

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. రాం చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మొత్తం ఐదు సాంగ్స్ ఉంటాయట. చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్ లో సినిమా అంటే ఆల్బం అదిరిపోవాల్సిందే. ఆచార్యలో ఉన్న ఐదు పాటల్లో ఒకటి స్పెషల్ సాంగ్ అని తెలుస్తుంది. ఆ సాంగ్ కోసం ముందు రెజినాని అనుకున్నారట కాని ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నాని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

సౌత్ హీరోయిన్స్ లో హీరోలకు ఈక్వల్ గా డ్యాన్స్ వేసే టాలెంట్ ఉన్న తమన్నా చిరుతో కాలు కదుపుతుంది. హీరోయిన్ గా చేస్తూనే ఐటం సాంగ్స్ చేస్తూ తన ఫాం కొనసాగిస్తున్న తమన్నా చిరుతో సైరా సినిమాలో కలిసి నటించింది. ఆ సినిమాలో సాంగ్స్, డ్యాన్సులకు ఛాన్స్ లేదు. ఆచార్యలో ఈ జోడీ కలిసి ఆడిపాడనున్నారు. కొద్దిపాటి గ్యాప్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మ్యూజికల్ హిట్ అందుకున్న మణిశర్మ చిరు సినిమాతో పూర్తిస్థాయి ఫాంలోకి రావాలని చూస్తున్నాడు.