అది వైరస్ కన్నా ప్రమాదం : కొరటాల శివ

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొర్టాల శివ తీసేది కమర్షియల్ సినిమాలో అయినా అందులో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉండేలా ప్లాన్ చేస్తాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల శివ తన నెక్స్ట్ సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తాడని తెలుస్తుంది. కరోనా తీవ్రత రోజు రోజుకి పరుగుతున్న ఈ టైంలో తమకు వచ్చిన కరోనా వ్యాధిని తెలియచేసి బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు కొరటాల శివ.

వైరస్ సోకిన వ్యక్తి రహస్యంగా ఉంచడం వైరస్ కన్నా ప్రమాదకరమని.. వైరస్ సోకిన విషయాన్ని కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు తెలియచేయాలని అన్నారు కొరటాల శివ. మీతో పాటుగా కుటుంబ సభ్యులను వ్యాధి నిర్ధారణ టెస్టులు చేయించుకుంటే ముందుగా జాగ్రత్తలు తీసుకుని త్వరగా కోలుకునే అవకాశం ఉందని అంటున్నారు కొరటాల శివ.