సాహో డైరక్టర్ పై అసంతృప్తి

ఆచార్య సినిమా పూర్తి చేసి ఆ వెంటనే లూసిఫర్ రీమేక్ చేసె ఆలోచనలో ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. రీమేక్ బాధ్యతలను సాహో డైరక్టర్ సుజిత్ మీద పెట్టాడు మెగాస్టార్. మొన్నామధ్య ఒకసారి తెలుగు వర్షన్ స్టోరీ చిరుకి వినిపించగా కొన్ని సలహాలు ఇచ్చాడట. ఇక లేటెస్ట్ గా ఫుల్ స్క్రిప్ట్ పూర్తి చేసి మరోసారి చిరుని కలిస్తే సుజిత్ చెప్పిన నరేషన్ మెగాస్టార్ ను అసంతృప్తి పరచిందట. స్క్రిప్ట్ బాగానే రాసుకున్నా సరే కొన్ని మార్పులు సూచించాడట.

అంతేకాదు ఫలానా టైం కల్లా కావాలని డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటిన సుజిత్ తన సెకండ్ సినిమానే బాహుబలి హీరోతో చేశాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో సినిమా సుజిత్ డైరక్షన్ లో రాగా ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అవలేదు కాని టేకింగ్ విషయంలో సుజిత్ కు మంచి మార్కులు పడ్డాయి. మరి సుజిత్ ఈ సూపర్ హిట్ రీమేక్ ను ఏం చేస్తాడో చూడాలి.