
కన్నడలో సూపర్ హిట్టైన లవ్ మ్యాక్ టైల్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారని తెలుస్తుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ సినిమా కన్నడలో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ రీమేక్ లో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుందని తెలుస్తుంది. ఇక హీరోగా జ్యోతిలక్ష్మి ఫేం సత్య దేవ్ నటిస్తున్నాడట.
చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ వచ్చి ప్రస్తుతం వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ లతో కెరియర్ బిజీగా మార్చుకున్న సత్య దేవ్ ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే వదిలిపెట్టడం లేదు. ఓ పక్క స్టార్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరో పక్క లీడ్ రోల్ చేస్తూ అలరిస్తున్నాడు. ఇక ఈ లవ్ మాక్ టైల్ సినిమాలో సత్య దేవ్ సరసన తమన్నా నటించడం విశేషం. మరి సూపర్ హిట్ సినిమా తెలుగు రీమేక్ ఇక్కడ ఆడియెన్స్ కు ఎలాంటి అనుభూతి ఇస్తుందో చూడాలి.