సాయి తేజ్ కోసం చిరంజీవి

మెగా మేనళ్లుడు సాయి తేజ్ ఇప్పుడు మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. చిత్రలహరి ముందు వరకు వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అవగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన చిత్రలహరి హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత మారుతి డైరక్షన్ లో వచ్చిన ప్రతిరోజూ పండుగే సినిమా కూడా సాయి తేజ్ కెరియర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం సుబ్బు డైరక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దేవా కట్ట డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి తన దగ్గరకు వచ్చిన ఓ కథను సాయి తేజ్ కు రిఫర్ చేశాడట. గోపాల్ అనే నూతన దర్శకుడు ఠాగూర్ మధుని మెప్పించేలా కథ చెప్పగా ఆ స్టోరీ చిరు దగ్గరకు వెళ్లిందట. కథ విన్న చిరంజీవి సాయి తేజ్ కు ఇది పర్ఫెక్ట్ అన్నాడట. మామ చెప్పాక ఇక తిరుగు ఉంటుందా అందుకే సాయి తేజ్ కూడా ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.