
ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత అమ్మడికి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం సాయి పల్లవి విరాట పర్వం, లవ్ స్టోరీ సినిమాల్లో నటిస్తుంది. రెండు డిఫరెంట్ జానర్ సినిమాలు అవడంతో ఈ రెండు సినిమాల మీద ఎంతో నమ్మకంగా ఉంది సాయి పల్లవి. నాగ చైతన్య సరసన లవ్ స్టోరీలో నటిస్తున్న సాయి పల్లవి ఆ సినిమాకు కేవలం హీరోయిన్ గానే కాదు కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేస్తుందట.
ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్ గా తన అనుభవాలను తను చేసే సినిమాల్లో ప్రదర్శించే సాయి పల్లవి. తను చేసే సినిమాలో ఏదో ఒక పాటలో డ్యాన్స్ తో దుమ్మురేపుతుంది. ఇక లవ్ స్టోరీలో ఏకంగా ఓ సాంగ్ కు ఆమె కొరియోగ్రఫీ చేసిందని తెలుస్తుంది. హీరోయిన్ గానే కాదు కొరియోగ్రాఫర్ గా కూడా సాయి పల్లవి తన టాలెంట్ చూపిస్తుంది. మరి అమ్మడు చేస్తున్న ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.