
అల వైకుంఠపురములో సక్సెస్ తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన త్రివిక్రం శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తైన తర్వాత ఈ సినిమా చేస్తాడని తెలుస్తుంది. అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ ప్రచరంలో ఉన్న ఈ సినిమా టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రం. ఆర్.ఆర్.ఆర్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
అందుకే అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు కేవలం తెలుగులో రిలీజ్ మాత్రమే అనుకున్న ఈ సినిమా కథ కాస్త పాన్ ఇండియా రేంజ్ కు సరిపడా మార్చేస్తున్నారట. సో కథతో పాటుగా టైటిల్ కూడా మారబోతుందని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తో ఎలాగు బాలీవుడ్ ఆడియెన్స్ కు పరిచయమవుతున్న తారక్ త్రివిక్రం సినిమాతో కూడా సత్తా చాటేలా చూస్తున్నాడు.