సూర్య 'నవరస'.. మరో కొత్త ప్రయోగం..!

కోలీవుడ్ హీరో సూర్య డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం స్టార్స్ అంతా ఓటిటి రిలీజ్ పై ఆసక్తి చూపుతున్నారు. కొందరు వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తున్నారు. వారి దారిలోనే కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య ఓ వెబ్ సీరీస్ లో నటిస్తున్నాడట. ఈ వెబ్ సీరీస్ లో సూర్య నెగటివ్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది. సౌత్ క్రేజీ డైరక్టర్ మణిరత్నం నిర్మాణంలో నవరసర టైటిల్ తో ఓ వెబ్ సీరీస్ రాబోతుంది. 

ఈ వెబ్ సీరీస్ ను 9 డిఫరెంట్ కథలతో.. 9 మంది దర్శకులు డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ లో సూర్యతో పాటుగా సిద్ధార్థ్, అరవింద స్వామిలు నటిస్తున్నారు. సూర్య నెగటివ్ షేడ్స్ అది కూడా నవసర అనే టైటిల్ తో అనగానే ఈ వెబ్ సీరీస్ పై అంచనాలు పెరిగాయి.