మెగాస్టార్ కోసం కథ సిద్ధమట..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి సుజిత్ డైరక్షన్ లో లూసిఫర్ రీమేక్ గా నటిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. వెంకీమామ తర్వాత బాబి చిరు కోసం ఓ లైన్ సిద్ధం చేయడం దానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. 

ఇక ఇప్పుడు చిరు కోసం పూర్తి కథ సిద్ధం చేశాడట బాబి. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తునని తెలుస్తుంది. ఆచార్య సినిమా పూర్తి కాగానే సుజిత్ సినిమా చేయాలని చూస్తున్న చిరంజీవి బాబితో కూడా వెరైటీ స్టోరీతో వస్తున్నాడని తెలుస్తుంది. మరి చిరుతో మెగా ఛాన్స్ పట్టేసిన బాబి ఎలాంటి సినిమా అందిస్తాడో చూడాలి.