సమంత బాటలో త్రిష కూడా..!

తాము నటించే సినిమాలు ఎక్కడ రిలీజ్ చేసినా ఓకే అంటున్నారు సెలబ్రిటీలు. ముఖ్యంగా హీరోయిన్స్ చేసేది సినిమానా.. వెబ్ మూవీనా అన్నది సంబంధం లేదని అంటున్నారు. సినిమా ఛాన్సులు కొద్దిగా సన్నగిల్లుతున్నాయ్ అనుకునేలోపు వెబ్ మూవీస్ ఛాన్సులు పట్టేస్తున్నారు. కొత్తగా వచ్చిన ఆహాతో ఈ హడావిడి ఎక్కువైంది. అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లకు పోటీ ఇచ్చేలా అహా విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఇదిలాఉంటే సౌత్ క్రేజీ హీరోయిన్ సమంత ఇప్పటికే ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ లో నటిస్తుంది. ఈ వెబ్ సీరీస్ లో సాం నెగటివ్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది.  

ఇక ఇదేబాటలో మరో సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కూడా వెబ్ సీరీస్ లకు ఓకే చెప్పిందట. కోలీవుడ్ డైరక్టర్ రామ్ సుబ్రహ్మణ్యం డైరక్షన్ లో ఈ వెబ్ సీరీస్ వస్తుందట. తండ్రి కూతురు మధ్య జరిగే ఎమోషనల్ స్టోరీగా ఈ వెబ్ సీరీస్ వస్తుందట. దాదాపు రెండు దశాబ్ధాల నుండి హీరోయిన్ గా చేస్తున్న త్రిష డిజిటల్ రంగంలో కూడా దూసుకెళ్లడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాను చేజార్చుకున్న త్రిష కోలీవుడ్ లో ఇప్పటికే రెండు సినిమాల్లో నటిస్తుంది.