అల్లు అర్జున్ సినిమా సీక్వల్ లో రామ్

హీరో,  డైరెక్టర్ కలిసి హిట్టు కొడితే ఆ కాంబోకి విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మళ్ళీ మళ్ళీ ఆ కాంబో రిపీట్ అవ్వాలని కోరుకుంటారు. అంతేకాదు సూపర్ హిట్ సినిమాకు కుదిరితే సీక్వల్ కూడా ప్లాన్ చేస్తారు. అలా కాంబో రిపీట్ అవడం వారి సినిమాలే సీక్వల్ తీయడం ఇదివరకు జరిగాయి. లేటెస్ట్ గా అలాంటి ఓ క్రేజీ కాంబో రిపీట్ అవుతుందని అనుకోగా వెరైటీగా ఆ సీక్వల్ లో హీరో మారిపోయాడని తెలుస్తుంది. 

ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే.. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో స్టయిల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా రేసుగుర్రం. ఈ సినిమా అప్పటివరకు ఉన్న బన్ని కెరియర్ లో బెస్ట్ హిట్ గా నిలిచింది. సైరా తర్వాత సురేందర్ రెడ్డి అల్లు అర్జున్ తో రేసుగుర్రం సీక్వల్ ప్లాన్ చేశాడు. కానీ బన్ని మరో రెండేళ్ల దాక బిజీ అని తెలిసి ఆ సీక్వల్ సినిమాను ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే సూరి చెప్పిన కథకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి ఈ సినిమా నిజంగా రేసుగుర్రం సీక్వల్ గా వస్తుందా లేక అలా ప్రమోట్ చేస్తున్నారా అన్నది త్వరలో తెలుస్తుంది.