హీరోయిన్, టైటిల్ ఫిక్స్.. కాని చెప్పరేంటో..?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. బిబి-3 అంటూ వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. డైలాగ్ టీజర్ తో దుమ్ముదులిపిన బాలయ్య బాబు ఈసారి అనుకున్న హిట్ కొట్టడం పక్కా అనేలా గర్జిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం కథానాయికల వేట కొనసాగుతూనే ఉంది. మొన్నటిదాకా బిబి3లో అంజలి ఈ సినిమాలో నటిస్తుందని వార్తలు రాగా ఆమె కాదు అమలా పాల్ ఆ ఛాన్స్ అందుకుందని వార్తలు వచ్చాయి.

ఇక ఇప్పుడు చిత్రయూనిట్ నుండి వస్తున్న సమాచారం ప్రకారం బాలయ్య, బోయపాటి సినిమాలో అమలా పాల్ కూడా హీరోయిన్ గా నటించడం లేదట. ఈ సినిమా కోసం కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తారని తెలుస్తుంది. అంతేకాదు మోనార్క్, సూపర్ మ్యాన్ టైటిల్స్ పరిశీలనలో ఉండగా టైటిల్ కూడా ఫైనల్ చేశారట. ఇక టైటిల్, హీరోయిన్ కు సంబందించిన విషయాలను త్వరలో వెళ్లడిస్తారని తెలుస్తుంది.