'ఆహా' డోస్ తగ్గిస్తున్నారట..!

తెలుగు ఓటిటి ఆహా ఇప్పటికే కోటి వ్యూయర్ షిప్ తో సరికొత్త సంచలనాలు సృష్టిస్తుంది. కరెక్ట్ గా లాక్ డౌన్ కు ముందుగా ఆహా స్టార్ట్ చేయడం బాగా కలిసి వచ్చింది. ఇదిలాఉంటే అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ లా ఇందులో కూడా మొదట్లో అడల్ట్ కంటెంట్ ఉండేలా జాగ్రత్త పడ్డారు. అడల్ట్ డోస్ ఎక్కువ ఉన్న వెబ్ సీరీస్ లను రిలీజ్ చేశారు. అయితే తెలుగు ఓటిటి కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా వాటిని చూస్తున్నారు. అందుకే ఫీద్ బ్యాక్ కాస్త నెగటివ్ గా రావడంతో ఆహాలో ఇక మీదట అడల్ట్ డోస్ ఎక్కువ ఉన్న వెబ్ సీరీస్ లను ఉండకుండా జాగ్రత్త పడుతున్నారట.

ఇప్పటికే కొత్త వారితో 20కి పైగా వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ ప్లాన్ చేస్తున్నారట మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. థియేటర్ లు ఎప్పుడు తెరుస్తారో తెలియదు కాబట్టి అహాలోనే తెలుగు చిన్న బడ్జెట్ సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు రిలీజ్ చేస్తారట. మొత్తానికి ఆహాలో అడల్ట్ డోస్ తగ్గించి ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా చేస్తున్నారు.