రకుల్ కూడా తగ్గించేసిందా..!

మన్మధుడు 2 తర్వాత తెలుగులో అడ్రెస్ లేకుండా వెళ్లిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నితిన్ హీరోగా చంద్ర శేఖర్ యేలేటి డైరక్షన్ లో సినిమాకు సైన్ చేసింది. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా తనతో సినిమా అంటే కోటి వరకు డిమాండ్ చేసే రకుల్ ఇక మీదట నిర్మాతకు హెల్ప్ చేసేందుకు సగం పారితోషికమే తీసుకుంటుందని తెలుస్తుంది. 

తెలుగులో లాస్ట్ ఇయర్ వరకు క్రేజీ హీరోయిన్ అయిన రకుల్ ఇప్పుడు ఆమెతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపట్లేదు. వచ్చిన అరకొర అవకాశాలను కూడా కాదని అంటుందట. అయితే కథ నచ్చి సినిమా ఓకే అనుకుంటే మాత్రం కరోనా ప్రభావం వల్ల కష్టాలు పడుతున్న నిర్మాతలను ఆదుకునేందుక్ తన వంతు సాయంగా రెమ్యునరేషన్ లో 50 శాతం కట్ చేసుకుంటుందని తెలుస్తుంది. రకుల్ తీసుకున్నె ఈ నిర్ణయానికి అందరి నుండి ప్రశంసలు అందుతున్నాయి.