
సూపర్ స్టార్ రజినికాంత్.. లోకనాయకుడు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇద్దరు కెరియర్ స్టార్టింగ్ లో కలిసి నటించారు. ఆ తర్వాత ఎవరికి వారు అగ్ర హీరోలుగా మారారు. కొన్నాళ్లుగా రజిని, కమల్ కలిసి సినిమా చేస్తారని వార్తలు వస్తున్నా అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కూడా రజినితో కమల్ సినిమా చేస్తున్నా రజిని, కమల్ స్క్రీన్ షేర్ చేసుకోవడం లేదట. అదేంటి అంటే కమల్ నిర్మాతగా రజినికాంత్ హీరోగా సినిమా వస్తుందట.
లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ తో మాస్టర్ సినిమా చేస్తున్న ఈ డైరక్టర్ రజినికాంత్ ఇమేజ్ కు సరిపడే సూపర్ స్టోరీ రాసుకున్నాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. అయితే నిర్మాత కాబట్టి కమల్ రజిని సినిమాలో ఏదో ఒక చిన్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది.