
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు రాధే శ్యాం టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ మహానటి డైరక్టర్ నాగ్ అశ్విన్ డైరక్షన్ లో భారీ మూవీ చేస్తాడని తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో దీపిక పదుకునే హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఇక ఇదేకాకుండా ప్రభాస్ ను బాలీవుడ్ లో స్ట్రైట్ సినిమాలో నటింపచేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
బాలీవుడ్ డైరక్టర్ ఓం రావత్ డైరక్షన్ లో ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ సినిమా ఉంటుందట. ఈ సినిమాలో స్పెషల్ థింగ్ ఏంటంటే హృతిక్ రోషన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుటాడని తెలుస్తుంది. ప్రభాస్, హృతిక్ మల్టీస్టారర్ మూవీగా ఇది వస్తుందట. సినిమాను టి సీరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.