
ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఏ సినిమా చేస్తాడన్న విషయం మీద రోజుకో న్యూస్ వైరల్ గా మారుతుంది. ఆర్.ఆర్.ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చరణ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాల తర్వాత చరణ్ మొదటిసారి త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంటారట. అదేంటి అంటే త్రివిక్రం, చరణ్ కాంబో మూవీని పవన్ కళ్యాణ్ నిర్మిస్తాడని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుందత. కొన్నాళ్ల క్రిందట చరణ్ తో ఓ సినిమా చేస్తానని చెప్పిన పవన్ తన మిత్రుడు త్రివిక్రం డైరక్షన్ లో ఆ సినిమా చేస్తాడని తెలుస్తుంది. అసలైతే ఆర్.ఆర్.ఆర్ తర్వాత త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈమధ్యలోనే కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పిన కథ నచ్చడంతో తారక్ ఆ ప్రాజెక్ట్ ను ముందు తెరకెక్కించాలని చూస్తున్నాడట. అందుకే త్రివిక్రం చరణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని అంటున్నారు. మరి నిర్మాతగా పవన్.. చరణ్ హీరోగా.. త్రివిక్రం చేసే ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.