
ఖైది నంబర్ 150 సినిమాతో పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత తన డ్రీం ప్రాజెక్ట్ సైరాతో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నడు చిరంజీవి. ఈ సినిమా 40 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత చిరు మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ తో వస్తున్నాడు. సాహో డైరక్టర్ సుజిత్ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. అయితే సినిమాలో చిరుతో పాటుగా మరో యంగ్ హీరో పాత్ర ఉంటుంది. ఆ పాత్రకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు అభిప్రాయపడుతున్నారట. చిరు సినిమాలో విజయ్ అబ్బో ఈ ఆలోచనే అదిరిపోయేలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మెగాస్టార్ నుండి మెగా ఆఫర్ వస్తే ఎగిరిగంతేసే ఛాన్స్ ఉన్నా ప్రస్తుతం విజయ్ కమిట్ అయిన సినిమాల లిస్ట్ కూడా చాలా ఉన్నాయి. మరి డేట్స్ అడ్జెస్ట్ అయితే మాత్రం తప్పకుండా సీనియర్ స్టార్ హీరో.. యువ సెన్సేషన్ కలిసి చేసే సినిమా చూసే ఛాన్స్ ప్రేక్షకులకు దక్కినట్టే.