
కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో వరుస క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకుంటూ ఫుల్ ఫాం లో ఉంది. ఈ ఇయర్ ఆల్రెడీ సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తుంది. తెలుగులోనే కాదు తమిళంలో విజయ్ సినిమా ఛాన్స్ కూడా అందుకుంది అమ్మడు. అయితే తను సినిమా ఒప్పుకోవాలంటే మాత్రం కచ్చితంగా ఆ రెండు ఉండాల్సిందే అంటుంది రష్మిక.
సినిమా కథలో ఎమోషన్ తనని టచ్ చేయాలని.. అంతేకాకుండా ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ అయి కూడా ఉండాలని అంటుంది రష్మిక. ఎలాంటి సినిమా అయినా ఈ రెండు యాస్పెక్ట్స్ ఉండే తప్పకుండా ఆ సినిమా చేస్తానని అంటుంది రష్మిక మందన్న. తెలుగు, తమిళ భాషల్లోనే కాదు మాతృ భాష కన్నడలో కూడా అమ్మడు వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం సౌత్ లో ఫుల్ ఫాం లో ఉన్న స్టార్ ఎవరీనా ఉన్నారు అంటే అది రష్మిక తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు.