
సూపర్ స్టార్ మహేష్ 27వ సినిమా పరశురాం డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా పొలిటికల్ సెటైరికల్ మూవీగా రాబోతుందని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుందని అంటున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమాలో విలన్ గా ఉపేంద్ర, సుదీప్ దగ్గర నుండి అరవింద స్వామి దగ్గర వరకు వచ్చారు. మెయిన్ విలన్ ఎవరో తెలియదు కాని సినిమాలో మ్మహేష్ కు విలన్ గా బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ నటిస్తున్నాడని తెలుస్తుంది.
బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో తన హడావిడితో అందరిని మెప్పించిన కౌశల్ ఫైనల్ విన్నర్ గా నిలిచాడు. సీజన్ తర్వాత కౌశల్ కు బయట కూడా క్రేజీ ఫాలోవర్స్ ఏర్పడ్డారు. అప్పట్లో అతనికి సినిమా ఛాన్సులు వచ్చాయని అన్నారు. కాని ఒక్కటంటే ఒక్క సినిమాలో కనిపించలేదు. ఫైనల్ గా మహేష్ సర్కారు వారి పాట సినిమాలో కౌశల్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది.