
రోజు రోజుకి కరోనా ప్రభావ పెరుగుతుండటంతో సినిమా వాళ్లు ఎవరు షూటింగ్ చేసే ఆలోచన లేదని తెలుస్తుంది. అంతేకాదు బుల్లితెర నటులలో ఇద్దరు ముగ్గురికి కరోనా కేసులు రావడంతో సినిమా వాళ్లు మరింత భయపడుతున్నారు. ఈ క్రమంలో స్టార్ యాంకర్ ఝాన్సికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వార్తలు తన దాకా వెళ్లడంతో యాంకర్ ఝాన్సి స్పందించారు.
తను అన్ని జాగ్రత్తలు తీసుకునే షూటింగ్ లో పాల్గొంటున్నానని.. తనకు ఎలాంటి సిం టంస్ కూడా లేదని.. లేనిపోని వార్తలు రాసి ఫ్యామిలీలను ఇబ్బంది పెట్టొద్దని చెబుతుంది ఝాన్సి. సెలబ్రిటీస్ మీద లేనిపోని వార్తలు రాసి దాన్ని క్యాష్ చేసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఇదివరకే చాలామంది సెలబ్రిటీస్ చెప్పారు. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లో ఝాన్సి కూడా మీడియా మీద కస్సుబుస్సులాడుతుంది.