ఒక్కడు హిస్టరీ రిపీటా..!

సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతి బరిలో నిలుస్తుంది. సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ మూవీ కోసం అనీల్ రావిపుడి కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్ వేయించారు.   

రామోజి ఫిల్మ్ సిటీలో 4 కోట్ల ఖర్చుతో ఈ సెట్ వేశారని తెలుస్తుంది. మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాలో కొండారెడ్డి బురుజు సెట్ వేశారు. మళ్లీ సరిలేరు నీకెవ్వరు కోసం ఆ సెట్ వేయడం విశేషం. గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన ఒక్కడు మహేష్ కెరియర్ లో మొదటి కమర్షియల్ హిట్ గా నిలిచింది. మరి అదే సెంటిమెంట్ తో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా అలాంటి హిట్ సాధిస్తుందని చెప్పొచ్చు. అసలే ఫాంలో ఉన్న డైరక్టర్.. ఫాంలో ఉన్న హీరో కలిసి చేస్తున్న ఈ క్రేజీ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.