
మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యాన్స్ హంగామాతో ఈవెంట్ లో వర్షం వచ్చినా సరే ఈవెంట్ ను సక్సెస్ చేశారు.
పరుచూరి బ్రదర్స్ చాలా ఏళ్లుగా ఈ కథను తనతో డిస్కస్ చేశారని.. అయితే అప్పట్లో తను చేద్దామని అనుకున్నా పదిఏనేళ్ల క్రితం 70 కోట్లు పెట్టడం కష్టమని భావించి ఈ సినిమాను తీయాలని ఉన్నా ప్రయత్నించలేదని అన్నారు చిరంజీవి. ఇక బాహుబలి సినిమా వల్లే సైరా నరసింహా రెడ్డి తీశామని. వందల కోట్లు ఖర్చు పెట్టినా దాన్ని రాబట్టుకోవచ్చనే భరోసా ఇచ్చాడు రాజమౌళి. అందుకే సభాముఖంగా రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్పారు చిరంజీవి.
సైరా యువతకు మెచ్చే సినిమా అవుతుందని.. ఇందులో పాటలు, డ్యాన్సులు లేకపోవచ్చు కాని మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుందని.. సినిమాలో కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారిలు చేశాను.. ఈ వయసులో కష్టమనిపించినా తనకు డూప్ అంటే ఇష్టం ఉండదు కనక ఎలగోలా చేశానని అన్నారు. ఒక్కసారి మేకప్ వేస్తే పాతికేళ్ల క్రితం జోష్ వచ్చేస్తుందని అన్నారు చిరు. సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని.. అతని కష్టానికి హ్యాట్సాఫ్. ఇక రాం చరణ్ తన నాన్నకే కాదు తెలుగు వారందరికి ఇస్తున్న గిఫ్ట్ ఈ సినిమా అని అన్నారు చిరంజీవి. చిరంజీవి ప్రసంగానికి మెగా ఫ్యాన్స్ అంతా ఈలలు, గోలలతో ఆయన మీద అభిమానాన్ని చూపించారు.