
బిగ్ బాస్ నడుస్తున్న టైంలో స్టార్ సినిమా నుండి చిన్న సినిమా వరకు అదే ప్రమోషనల్ స్టేజ్ గా వాడుకోవడం అలవాటే. బిగ్ బాస్ చూస్తున్న ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా సినిమా ప్రమోషన్స్ ఉంటాయి. పెద్ద సినిమాలకు ఇది అవసరమా అనే డౌట్ ఉన్నా స్టార్ సినిమాలకు మరింత క్రేజ్ తెచ్చేలా బిగ్ బాస్ హౌజ్ లో ఆ సినిమా ప్రమోషన్స్ జరుగుతారు. ఈ సీజన్ బిగ్ బాస్ షోలో చాలా సినిమాల ప్రమోషన్స్ జరిగాయి.
అయితే హౌజ్ లోకి వెళ్లి సినిమా ప్రమోట్ చేసింది లేదు. అయితే అక్టోబర్ 2న సైరా రిలీజ్ ఉంది కాబట్టి మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ బిగ్ సర్ ప్రైజ్ గా హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. బిగ్ బాస్ వల్ల సైరాకు ఎంత ప్రమోషన్ అన్నది చెప్పలేం కాని చిరంజీవి వస్తే షోకి చాలా ప్లస్ అవుతుంది. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు హోస్ట్ గా చిరు అదరగొట్టాడు. అయితే చిరు హౌజ్ లోపలకు వెళ్తాడా నాగ్ బదులు హోస్ట్ గా సర్ ప్రైజ్ చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా బిగ్ బాస్ షోలో చిరంజీవి కచ్చితంగా ఆ ఎపిసోడ్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.